Friday, November 22, 2024

యూపీలో మరో వివాదం.. ‘‘80 వర్సెస్ 20’’ అంటూ యోగి కామెంట్స్..

అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారమే రేపుతున్నాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలను ‘‘80 వర్సెస్ 20 వార్’’ అని బీజేపీ నేత, సీఎం యోగి కామెంట్ చేయడం వివాదాస్పదమవుతోంది. యోగీ కావాలనే మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని.. 80శాతం మంది హిందువులు, 20శాతం మంది మైనార్టీలు ఉన్నారని వ్యతిరేఖ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ మధ్య ఒక న్యూస్ చానల్ తో యోగి మాట్లాడుతుండగా బ్రాహ్మణ ఓట్లపై ఒక ప్రశ్న ఎదురైంది. దీంతో సీఎం యోగీ దానికి బదులుగా ‘‘పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది.. ఫైట్ ఇప్పుడు 80 వర్సెస్ 20గా మారింది’’ అన్నారు. ‘‘80 శాతం మంది జాతీయవాదం, సుపరిపాలన, అభివృద్ధికి మద్దతు పలుకుతున్నారు. అలాంటి వారు తప్పకుండా బీజేపీకి సపోర్టుగా నిలుస్తారు. వ్యతిరేకించే వారు, మాఫియా, నేరగాళ్లకు సపోర్టు చేసేవాళ్లు, రైతు వ్యతిరేకులు మరో 20శాతం మంది ఉంటారు’’ అని తెలిపారు. 80శాతం మంది సపోర్టుతో బీజేపీ గెలిచి తీరుతుంది అని యోగీ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement