ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేయాలని రాష్ట్ర గవర్నర్ సూచనతో యోగి రాజీనామా సమర్పించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు తన రాజీనామాను సమర్పించారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ తొలి పదవీకాలం ముగిసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లు కైవసం చేసుకుని ఆ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టనుంది. బీజేపీ మిత్రపక్షాలు అప్నా దళ్ (ఎస్) 12 సీట్లు, నిషాద్ పార్టీ 6 సీట్లు గెలుచుకున్నాయి. కాగా, రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా యోగి ప్రమాణస్వీకారం చేయనున్నారు.