1,166పాత చట్టాలతో అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించామని రాష్ట్ర న్యాయ కమిషన్ ఛైర్మన్ ఎ.ఎన్.మిట్టల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 800చట్టాలను రద్దు చేసింది. యోగి ప్రభుత్వం ముందు లా కమిషన్ లో కనీసం సిబ్బంది కూడా లేరని మిట్టల్ వివరించారు. తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం సిబ్బందిని తీసుకున్నామని వివరించారు. కమిషన్ కు యోగి సర్కార్ నుంచి పూర్తి సహకారం అందుతోందని మిట్టల్ తెలిపారు.
న్యాయ శాఖ ఉన్నా కూడా.. ముఖ్యమైన అంశాల గురించి కమిషన్ సలహాలు తీసుకుంటారన్నారు. తామిచ్చిన 21 నివేదికల్లో 11 నివేదికలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఓ చట్టాన్ని తయారు చేయడానికి, అమలు చేయడానికి ముందు 20 నుంచి 25 మంది సీనియర్ అధికారులతో సీఎం యోగి సంప్రదింపులు జరుపుతారని, అంతా మంచిదే అని చెప్పాకే చట్టాలను అమలు చేస్తారని యోగిని కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..