దేశ రాజధాని ఢిల్లీలో ఒరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉన్నతాధికారులతో కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించారు.
కోవిడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లో భాగంగా కింద అన్ని విద్యా సంస్థలను మూసివేయనున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు 20కి పరిమితం చేశారు. ఢిల్లీ మెట్రో, బస్సులలో సీట్ల ఆక్యుపెన్సీని 50%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో వరుసగా రెండు రోజుల పాటు 0.5% కంటే ఎక్కువ పాజివిటీ రేటును నమోదైంది. ఒక వారంలో కరోనా కేసులు 1,500 దాటుతాయి. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉన్నామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్, వెంటిలేటర్ల వినియోగం పెరగలేదని చెప్పారు.
మార్కెట్‌లు, మాల్స్‌లో బేసి-సరి సూత్రాన్ని అమలు చేయనున్నారు. ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల మధ్య తెరవడానికి అనుమతి ఇచ్చారు. అయితే, నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు అన్ని రోజులు తెరిచి ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రెస్టారెంట్లు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు, బార్‌లు మధ్యాహ్నం 12-10 గంటల మధ్య కూడా 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
పాఠశాలలు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, బాంకెట్ హాళ్లు, ఆడిటోరియంలు, స్పాలు, జిమ్‌లు మరియు వినోద పార్కులు మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు 100% గ్రేడ్ పని చేయనున్నారు. అయితే, ప్రైవేట్ సంస్థలు మాత్రం 50% సిబ్బందితో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల మధ్య పని చేయడాలని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital