కరోనా సోకిన ఓ గర్భిణికి నార్మల్ డెలివరీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై ప్రసంశలు అందుతున్నాయి. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన లకవత్ రజితకు నొప్పులు రావడంతో ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రజితకు రెండురోజుల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రజితకు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది చెప్పారు. కరోనా బాధితురాలికి విజయవంతంగా డెలవరీ చేసిన వైద్యసిబ్బందిని మంత్రి కేటీఆర్ సహా ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.
కరోనా సోకిన గర్భిణికి నార్మల్ డెలివరీ.. వైద్య సిబ్బందికి అభినందించిన మంత్రి
Advertisement
తాజా వార్తలు
Advertisement