Saturday, November 23, 2024

కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారా?

కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారా? ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా? యడ్డీ స్థానంలో మరొకరిని నియమిస్తారనే ఊహాగానాలు కర్ణాటకలో వివిపిస్తున్నాయి. కర్ణాటకలో అధికార బీజేపీ నాయకత్వ మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. అధిష్ఠానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని యడియూరప్ప  ఇప్పటికే ప్రకటించారు. సీఎంపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలంటూ డిమాండ్ చేస్తుండడంతో అటువైపు దృష్టిసారించిన అధిష్ఠానం.. పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయాలను సేకరిస్తోంది. అయితే, వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలో ఎన్నికల జరగనుండడంతో బీజేపీ నాయకత్వం ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కర్ణాకటలో సీఎం మార్పు నిర్ణయాన్ని విరవించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి యడ్డీని మార్చకూడదనే అభిప్రాయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు సమాచారం.

కర్ణాటకు కొత్త సీఎం రానున్నారని, సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, డిప్యూటీ సీఎం అశ్వథనారాయణ్​, ఓ లింగాయత్ నేత పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి మార్పు లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ స్పష్టం చేశారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను నళిన్‌ కతీల్‌ తోసిపుచ్చారు. యడియూరప్పకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎందరో నేతలున్నారని సీఎం రేసులో ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. యడియూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే ఆలోచన పార్టీకి లేదని ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు.

మరోవైపు అసంతృప్తి ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర బీజేపీ 10 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సిఎంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నలీన్ కుమార్ కతీల్, నలుగురు మంత్రులు, నలుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. బిజెపి ఆగ్ర నాయకత్వం ఇప్పుడు యూపీ, ఉత్తరాఖండ్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎంను మార్చేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాష్ట్ర మంత్రి సీపీ యోగేశ్వర్ ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, బసనగౌడ పాటిల్​ యత్నాల్​.. నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లిన వారిని హైకమాండ్ తిప్పి పంపింది. పార్టీ పెద్దలతో కలిసేందుకు అనుమతి లభించలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పునకు భాజపా యోచిస్తోందన్న ఊహాగాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు 65 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య సోమవారం వెల్లడించారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల గురించి తాను కర్ణాటక ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌తో చర్చించినట్లు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement