లోకాయుక్త కర్ణాటక మాజీ సీఎం..బిజెపి అగ్రనేత యడియూరప్ప..అతని కుమారుడు.. బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలపై కేసు నమోదు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (బీడీఏ) పనుల కాంట్రాక్టుల మంజూరులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ టీజే అబ్రహాం అనే సామాజిక కార్యకర్త కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ పిటిషన్ ను సదరు కోర్టు తిరస్కరించింది. దీంతో, అబ్రహాం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు యడ్డీ, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని యడియూరప్ప తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement