ఢిల్లీలో ఈరోజు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 27న ఉదయం 11:30 గంటలకు యశ్వంత్ సిన్హా తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. యశ్వంత్ సిన్హాకు ఇప్పటి వరకు 22 పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ఈరోజు రాత్రి వరకు ఖరారు చేసే అవకాశముంది. యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 24 ఏండ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొనసాగి 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.