“Once a forester, now a river student”.. ఈ పదాలు ఆయన జీవన గమనాన్ని తెలియజేస్తాయి. చాలా సంవత్సరాలుగా అతని ట్విట్టర్ బయోగా ఇవే ఉంటున్నాయి. మనోజ్ కుమార్ మిశ్రా ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి నుంచి జీవితకాల నదుల ప్రేమికుడిగా మారారు. యమునా క్రుసేడర్గా పేరుగాంచారు. అయితే 68 ఏండ్ల ఈ మహామనిషి ఇక లేరని చెప్పడానికి కష్టంగానే ఉంది.. భోపాల్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
యమునా జియే అభియాన్ (YJA) కన్వీనర్‌గా మనోజ్ మిశ్రా ప్రసిద్ధి చెందారు. – యమునా పరిరక్షణ కోసం ప్రచారం చేయండి.. దాని సంరక్షణకు- 2007 నుండి ఎన్నో అంశాలను తీసకుని విజయవంతం చేశారు. మిశ్రా పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఉత్తర్వు బహుశా అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. యమునా నది పునరుజ్జీవనానికి కాలానుగుణ ప్రణాళికను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.