యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు సమయం ఆసన్నమైంది. అందమైన ధార్మిక, శిల్పకళా అద్భుతంగా తీర్చిదిద్దిన పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. యాదరి ఆలయం యొక్క అద్భుతమైన వాస్తుశిల్పం, రూపాంతరం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన దేవాలయాలలో ఒకటిగా నిలువనుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి విశిష్టమైనది. భక్తులను భక్తి సముద్రంలో మంత్రముగ్ధులను చేసేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు.
యాదాద్రిలో మార్చి 21 నుంచి వారం రోజులపాటు మహాసుదర్శన యాగం నిర్వహించారు. కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు భక్తిభావం ఉట్టిపడేలా స్వర్ణకాంతులీనుతోంది. కొండపైన, దిగువన పచ్చదనం పరచుకుని ప్రకృతి సోయగాలు సంతరించుకున్నాయి. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు స్వరం సిద్ధమైంది. కొండ దిగువన విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి.