Friday, November 22, 2024

మార్చి 4 నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా బాలాలయంలోనే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టలైన శ్రీ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని 10న రాత్రి నిర్వహిస్తారు. 11న శ్రీ స్వామి వారి తిరు కల్యాణోత్సవం, 12న శ్రీ స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించబడుతుంది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవ కల్యాణోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీ. స్వయంగా ముఖ్యమంత్రి లేదా ? దేవాదాయ శాఖ మంత్రి ? ప్రభుత్వ ప్రతినిధి సమర్పించడం జరుగుతుంది. మార్చి 28వ తేదీన ప్రధానాలయ పున: ప్రారంభం నేపధ్యంలో ప్రస్తుత బాలాలయంలోనే బ్రహ్మోత్సవాల నిర్వహణ జరపనున్నారు. పున: నిర్మాణానికి ముందు కొండ పైన పురాతన కల్యాణ మండపం ఉండేది. అందులోనే నిర్వహించేవారు. నిర్మాణాలు జరుగుతున్న ఇటీవలి కాలంలో కొండ దిగువన బస్టాండ్‌ ఎదురుగా పాత జడ్పీ హైస్కూల్‌ మైదానంలో నిర్వహిస్తూ వస్తున్నారు. కల్యాణ వేదిక ఈ పర్యాయం కొండ పైననా ? లేక కొండ దిగువన నిర్వహిస్తారా ? తెలియాల్సి ఉంది. అదే విధంగా రథోత్సవాన్ని కూడా పట్టణ పురవీధుల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారా ? లేదా అని తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement