Friday, November 22, 2024

Spl Story | ఎక్స్​యూవీ700లో మంటలు.. కారు కొత్తదే, అయినా ఎందుకిలా జరిగిందంటే!?

అతని పేరు కుల్దీప్​ సింగ్​.. ఈ మధ్యనే మహీంద్రా కంపెనీకి చెందిన ఓ ప్రీమియం కారు కొనుగోలు చేశాడు. జాబ్​లో బిజీగా ఉండే తను.. వీకెండ్​లో ఫ్యామిలీతో అలా సరదాగా షికారుకు వెళ్లాలనుకున్నాడు. అయితే.. జైపూర్​ హైవేపై వారు జర్నీ చేస్తున్నప్పుడు కొత్త కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వారంతా హుటాహుటిన కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు కారు వరల్డ్​లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీనిపై ఆనంద్​ మహీంద్రా కూడా రెస్పాండ్​ అయ్యారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వీకెండ్​లో మహీంద్రా XUV700 యజమాని అయిన కుల్దీప్​ సింగ్​, అతని కుటుంబం జైపూర్ జాతీయ రహదారిపై వెళ్తోంది. వారు వెళ్తుండగానే కారులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కుటుంబ సభ్యులంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే.. ఎటువంటి ముందస్తు హెచ్చరిక కానీ, కారులో ఏదైనా సమస్య ఉన్నట్లు తమకు అలర్ట్​ ఏదీ రాలేదని.. అనుకోకుండా మంటలు చెలరేగాయని కారు యజమాని కుల్దీప్​ సింగ్​ కంపెనీకి కంప్లెయింట్​ చేశాడు. ఈ ఘటనలో మరింత విచిత్రం ఏమిటంటే.. ఈ XUV700  అధునాతన వేహికల్​ ఆరు  నెలల క్రితం కొన్నది.. మరీ ఇంత కొత్త కారులో ఎలా మంటలు చెలరేగాయన్నది ఇప్పుడు మిలయన్​ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. ఈ సంఘటనను ‘మహీంద్రా’ ప్రస్తావిస్తూ ఓ లేఖ రిలీజ్​చేసింది. పరిస్థితిని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన వెలువరించింది.

మహీంద్రా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ‘ఫైర్​ ఇన్సిడెంట్​’ కు సంబంధించిన కచ్చితమైన కారణంపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు మహీంద్రా ఆటోమేకర్ పేర్కొంది. ఓనర్‌తో టచ్‌లో ఉన్న కార్‌మేకర్ ఫీల్డ్ సర్వీస్ టీమ్, కారుకు సంబంధించి ప్రాథమిక తనిఖీని పూర్తి చేసింది. ఎక్స్ యూవీ700 కారులో ఫ్యాక్టరీ వైరింగ్‌ని తొలగించి, బయటి నుంచి యాక్సెసరీస్​ యాడ్​ చేశారని, వైరింగ్​ టాంపర్​ చేసినట్లు గుర్తించారు. దీనివల్లనే ఆ SUVలో ఫైర్ సంభవించినట్టు టెక్​ ఎక్స్​పర్ట్స్​ కనుగొన్నారు.

- Advertisement -

ఇక.. కారు యజమానులు ఎవరైనా సరే.. తమ వాహనాలను థర్డ్​ పార్టీ మెకానిక్​ సెంటర్లలో కానీ, లేదా విద్యుత్ వ్యవస్థకు అదనపు లోడ్‌ను యాడ్​ చేయవద్దని మహీంద్రా తన ప్రకటనలో సూచించింది. అది అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చని తెలిపింది. అధికారికమైన వాటి కంటే ఆఫ్టర్‌మార్కెట్ ఉపకరణాలు సాధారణంగా తక్కువ ధరలో ఉంటాయని, వాటికి పెద్దగా విశ్వసనీయత ఉండదని తెలిపింది. అంతేకాకుండా అధికారిక వర్క్ షాప్‌ల ద్వారా ఇన్‌స్టాల్ చేసిన భాగాలను రిపేరు చేయడం వల్ల ప్రమాదం తలెత్తే చాన్సెస్​ ఎక్కువగా ఉంటాయని వివరించింది. ఎందుకంటే ఆ ఉపకరణాలు వాహనం యొక్క ఎలక్ట్రికల్‌పై అదనపు భారాన్ని మోపుతాయని, ఇలా చేయడం వల్ల వారంటీ కూడా లేకుండా పోయే ప్రమాదం ఉందని మహీంద్ర తెలియజేసింది.

ఇక.. మహీంద్రా XUV700 యజమాని కుల్దీప్ సింగ్ వారి ప్రీమియం SUV కారుకు సంబంధించిన డిటెయిల్స్​తో ఆటోమేకర్‌ మహీంద్రాకు ట్విట్టర్‌లో కంప్లెయింట్​ చేశారు. XUV700  కొత్త కారు అయినందున దానికి ఎటువంటి మార్పులు చేయలేదని కూడా అతను తెలిపాడు. కార్ల తయారీదారు.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా విచారణ జరిపి.. ఈ అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించే వరకు తాము వెయిట్​ చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement