మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఖిలాడి’ చిత్రంలో మెరిసింది డింపుల్ హయాతీ. 19 ఏండ్లకే టాలీవుడ్ లో ‘గల్ఫ్’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. అయితే.. పలు సినిమాల్లో నటిస్తున్నా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తన కేరీర్ ను గాడిన పెట్టేందుకు గ్లామర్ షోకు తెరలేపింది. స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించి ఊరమాస్ స్టెప్పులతో అందరి మనస్సులను కొల్లగొట్టింది. ఆ తర్వాత యురేఖ మూవీలోనూ నటించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. ప్రస్తుతం రవితేజ నటించిన ‘ఖిలాడీ’లో రవితేజ సరసన నటించి మెప్పించింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేంది.
ప్రస్తుతం అంతో ఇంతో ‘డింపుల్ హయాతీ’కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే తనలాగే ఒక అపరిచితుడు పలువురుకి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు తెలిపింది. ఆ నంబర్ ను కూడా తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తి తనను అనుకరిస్తున్నాడని, ఎవరూ మోసపోకూడదని పేర్కొంది. తను తెలిపిన నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేసి.. పోలీసులకు ఫిర్యాదుచేయాలని తన స్నేహితులకు విజ్ఞప్తి చేసింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ.. అలాంటి కాల్స్ కు రెస్పాండ్ కాకూడదని పేర్కొంది. ‘అబ్బాయిలకు కూడా ఆ అపరిచితుడు నాలాగే మాట్లాడుతూ మెసేజ్లు పంపుతున్నాడు. దయచేసి స్పందించకండి.. ఈ మూర్ఖుడిని వెంటనే బ్లాక్ చేయండి’ అంటూ సూచించింది.