Monday, November 18, 2024

ఆస్కార్ రేస్ లో ‘రైటింగ్ విత్ ఫైర్’

బెస్ట్ డాక్యుమెంట‌రీ క్యాట‌గిరీలో ఇండియా నుంచి రైటింగ్ విత్ ఫైర్ ఆస్కార్ కి నామినేట్ అయింది. రింటూ థామ‌స్ దీన్ని రూపొందించారు. కాగా ఆస్కార్స్ రేస్ నుంచి కూజంగ‌ల్ ఔట్ అయింది. ఆస్కార్స్ అకాడ‌మీ ఈ ఏడాది అవార్డుల‌కు చెందిన షార్ట్ లిస్ట్ ను ప్ర‌క‌టించింది. షార్ట్ లిస్ట్ కోసం డిసెంబ‌ర్ 15వ తేదీని ఓటింగ్ ని నిర్వ‌హించారు. రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంట‌రీని రింటూ థామ‌స్‌, సుష్మితా ఘోష్ తీశారు. ద‌ళిత మ‌హిళ ఓ ప‌త్రిక‌ను న‌డ‌ప‌డ‌మే ఆ డాక్యుమెంట‌రీలో మూల క‌థ‌. వ‌చ్చ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 94వ ఆస్కార్స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్నారు. రైటింగ్ విత్ ఫైర్‌ను రింటూ థామ‌స్ డైర‌క్ట్ చేశారు. సుష్మితా ఘోష్ కూడా డైర‌క్ష‌న్ టీమ్‌లో ఉన్నారు. ద‌ళిత మ‌హిళ న‌డిపిన ఖ‌బ‌ర్ ల‌హ‌రియా క‌థ ఆధారంగా ఈ డాక్యుమెంట‌రీని తీశారు. ఈ క్యాట‌గిరీలో మొత్తం 139 సినిమాలు పోటీప‌డ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement