– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఇవ్వాల (శుక్రవారం) లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఏడుగురు మహిళా రెజ్లర్ల ఆరోపణలపై శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈరోజు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
కాగా, బెంచ్ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను బెదిరింపు అవగాహనను అంచనా వేయాలని, లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలికలలో ఒకరికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఈ విషయంపై దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.