భారత్, ఇంగ్లడ్ జట్ల మధ్య ఇవ్వాల (మంగళవారం) జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తో్ంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు బంతిని తాకేందుకే భయపడాల్సి వస్తోంది. తొలి నాలుగు ఓవర్లలోనే కీలకమైన నాలుగు వికెట్లు తీసిన సీమర్లు.. ఆ తర్వాత మిడిలార్డర్ వెన్ను విరిచారు. దీంతో 25 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లండ్ జట్టు 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఒకే ఒక్క వికెట్ మిగిలి ఉండగా ప్రస్తుతం టోప్లే క్రీజ్లో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.
- Advertisement -