22 ఫిబ్రవరి 2022, మంగళవారం తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అది మీరు అనుకునే ప్రత్యేకత అయితే కాదు. సాధారణంగా ఏదైనా తేదీకి, సంవత్సరానికి లింక్ ఉంటుంది. 22 ఫిబ్రవరిలో సంవత్సరం తేదీ ఉన్నదని అంటారు కదా. కానీ, ఆ తేదీని 22022022గా రాస్తేనే దానికి ఒక ప్రత్యేకత వస్తుంది.
ఆ తేదీ పాలిండ్రోమ్, అంబిగ్రామ్‌గా ఉంటుంది. పాలిండ్రోమ్ అంటే.. ముందు నుంచి, వెనుక నుంచి చదివితే అదే అర్థం వస్తుంది. అంబిగ్రామ్ అంటే.. పై నుంచి, కింది నుంచి చదివినా అదే అర్థం వస్తుంది. కాకపోతే.. 2 అనే అంకెను డిజిటల్ క్లాక్ ఫార్మాట్‌లో రాయాల్సి ఉంటుంది. భలే ఉంది కదా. ఇలాంటి అరుదైన తేదీలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అటువంటి తేదీలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే. దాని గురించి అందరికీ చెప్పుకోవడమే.