Monday, November 25, 2024

మూడు గిన్నిస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన – ప్ర‌పంచంలోనే ఎతైన మ‌హిళ‌

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా పేరుపొందిన రుమేసా గెల్గి ఇప్పుడు మూడు అదనపు రికార్డులను బద్దలు కొట్టింది.= రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పొడవైన వేలు (ఆడ): 11.2 సెం.మీ (4.40 అంగుళాలు)..అతిపెద్ద చేతులు: ఆమె కుడిచేతి 24.93 cm (9.81 in) .. ఎడమ చేతి కొలతలు 24.26 cm (9.55 in)..పొడ‌వు (స్త్రీ): 59.90 సెం.మీ (23.58 అంగుళాలు) ఉన్నారు. గెల్గి జనవరి 1, 1997న జ‌న్మించింది. కాగా ఈమె న్యాయవాది, పరిశోధకురాలు ఫ్రంట్-ఎండ్ డెవలపర్.. ఆమె అక్టోబర్ 2021 నుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉంది. ఆమె మాట్లాడుతూ..నేను చిన్నతనంలో చాలా వేధింపులకు గురయ్యాను, కానీ పొడవుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను అందుకోవ‌డ‌మే అన్నారు. నేను యుక్తవయసులో 2014లో నా మొదటి రికార్డ్ టైటిల్‌ను అందుకున్నాను..ఈ సంద‌ర్భంగా గిన్నిస్ రికార్డ్ ని అందించిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మరో మూడు గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement