Tuesday, November 26, 2024

వ‌ర‌ల్డ్ మోస్ట్ పొల్యూటెట్ సిటీలు-రెండ‌వ‌స్థానంలో కోల్ క‌త్తా

వ‌ర‌ల్డ్ మోస్ట్ పొల్యూటెట్ సిటీల నివేదిక విడుద‌ల‌యింది. ముఖ్యంగా ఢిల్లీ, కోల్ కతాలలో కాలుష్యం గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ద‌ని తెలిపింది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్-2022 ప్రకారం.. కోల్‌కతా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రెండవ స్థానంలో ఉంది. కోల్‌కతాలో వార్షిక సగటు 84g/m3 ఫైన్ పార్టిక్‌లేట్ మ్యాటర్ (PM2.5) ఉంది. అంటే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) సిఫార్సు చేయబడిన సురక్షిత పరిమితి కంటే 17 రెట్లు ఎక్కువ. ఇక మొద‌టి స్థానంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ ఉండ‌టం గ‌మ‌నార్హం. దేశ ఆర్థిక రాజధాని ముంబయి 14వ స్థానంలో నిలిచింది. US ఆధారిత ఆరోగ్య సంస్థ, హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (HEI) ప్రచురించిన నివేదిక ఈ విష‌యాలు వెల్ల‌డించింది. దేశంలో నత్రజని కాలుష్యం తీవ్రమైన సమస్య అయినప్పటికీ, భారత నగరాల్లో PM2.5 అతిపెద్ద కాలుష్య సమస్య. 2010 నుండి 2019 వరకు PM2.5లో తీవ్ర పెరుగుదలను నివేదించిన మొదటి 20 నగరాల్లో, వాటిలో 18 నగరాలకు భారతదేశం నిలయంగా ఉంది. మిగిలిన రెండు ఇండోనేషియాలో ఉన్నాయి. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్టు ప్రకారం PM 2.5 గాఢతలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఈ నివేదిక 2010 నుండి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా 7,239 నగరాల్లో కాలుష్య మూలాల విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement