Saturday, November 23, 2024

మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ను ప్రారంభించ‌నున్న కేసీఆర్ – ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిన సంగ‌తే. కాగా ఆయ‌న ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి చుర‌క‌లు అంటించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయికి చేరుకుందని, దానిలో భాగంగా నిర్మించిన‌ మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను నేడు సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారు అని ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ ప్ర‌శ్నించారు.కాగా కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయాన్ని కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాసేప‌ట్లో ఆయ‌న‌ సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ చేరుకుని, అక్కడి పంపుహౌస్‌ను పరిశీలించి మోటార్లు ఆన్‌ చేస్తారు. 17,600 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. దీని ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలకు వాడ‌తారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement