వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్టును ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసింది. ప్రపంచంలో నివసించడానికి అత్యంత ఖరీదైన సిటీగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల వివరాలను ఈఐయూ పరిశీలించి ఇండెక్స్ (సూచీ)ను రూపొందించింది. రోజువారీ ఉత్పత్తులు, సర్వీసులు సుమారు 200 అంశాలను ఈఐయూ బేరీజు వేసి చూసింది. ఈ ఇండెక్స్‌కు న్యూయార్క్ సిటీలోని ధరలను కూడా బేస్‌గా తీసుకున్నారు.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం టెల్ అవివ్. ఆ తర్వాత స్థానంలో పారిస్, సింగపూర్ సిటీలు ఉన్నాయి. ఈ సూచీలో తక్కువ ర్యాంకులు పొందిన నగరాలుగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియాలోని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నిలిచాయి. ఇండియా విషయానికొస్తే చీపెస్ట్ నగరాల్లో టాప్ 10లో అహ్మదాబాద్ చోటు సంపాదించింది.