Saturday, November 23, 2024

కరోనాతో ఇప్పటివరకు 40 లక్షల మంది మృతి: WHO

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ మాయదారి రోగం బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి మాత్రం తగ్గడం లేదు. టీకా రేటుతో సంబంధం లేకుండా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మాస్‌ టూరిజంతో సంపన్న దేశాల ప్రజలు సాధారణ జీవనంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. పేద దేశాల్లో మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ధనిక దేశాలు ఆంక్షల సడలింపును వెనక్కి తీసుకోవాలన్నారు. తమ దగ్గర ఉన్న వనరులను ధనిక దేశాలు పంచుకోవాల్సిందిగా ఆయన కోరారు. ప్రపంచం అంతా సామూహికంగా ఒక్కటై ఈ మహమ్మారిని ఎదుర్కోవాల్సిందిగా పేర్కొన్నారు.

సంపన్న దేశాలు ఒకవైపు ఆంక్షలను సడలిస్తుండగా మరోవైపు ఆసియా దేశాలు తాజా కేసులతో పోరాడుతున్నాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఆసియావ్యాప్తంగా నూతన లాక్‌డౌన్‌లు ఏర్పాడుతున్నట్లు తెలిపింది. కొవిడ్‌ మరణాల రేటు నెలలో పదిరెట్లు పెరిగి గ్లోబల్‌ హాట్‌స్పాట్‌గా ఇండోనేషియా నిలుస్తోందని, బుధవారం ఒక్కరోజే ఇండోనేషియాలో 1,040 మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రెయేసన్‌ తెలిపారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉందన్నారు.

ఇది కూడా చదవండి: లాంబ్డా మరింత డేంజర్: డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

Advertisement

తాజా వార్తలు

Advertisement