Sunday, November 24, 2024

థర్డ్ వేవ్ వచ్చేసింది.. ప్రైమరీ స్టేజ్ లో ఉన్నాం: WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ పిడుగు లాంటి వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ఇప్పడిప్పుడే తగ్తుతున్న తరుణంలో… ప్ర‌పంచ‌వ్యాప్తంగా థర్డ్ వేవ్ తొలి దశ‌లో ఉన్న‌ట్లు ఆయన హెచ్చ‌రించారు. దురదృష్టవశాత్తూ మ‌నమంతా ప్రస్తుతం కోవిడ్ మూడవ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామ‌ని టెడ్రోస్  తెలిపారు. జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో సామాజిక చైత‌న్యం పెరిగిన‌ప్ప‌టికీ డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌డం, కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌ను క‌లిగిస్తుంద‌ని ఆయన చెప్పారు. క‌రోనా వైర‌స్ వేగంగా మారుతుంద‌ని, దీంతో వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. డెల్టా వేరియంట్ ఇప్పుడు 111 కి పైగా దేశాలలో ఉంద‌ని, దీన్ని వీలైనంత త్వ‌ర‌గా అంతం చేయాల‌ని, లేదంటే విప‌రీత‌మైన ప‌రిణామాలు ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌రుస‌గా నాలుగో వారం కూడా రోజువారీగా న‌మోద‌వుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌న్నారు. వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, కేవలం సంపన్న దేశాలు ఎక్కువ టీకాలను పొందాయని టెడ్రోస్ తెలిపారు. ఇప్ప‌టికీ ఇంకా అనేక దేశాల‌కు టీకాలు అస‌లు చేర‌లేద‌ని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే చెబుతోందని ఆయన గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: ఇండియా లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement