మంకీ పాక్స్ వైరస్ ఇప్పటి వరకు 27దేశాలకు విస్తరించింది.. కాగా 780మంకీపాక్స్ కేసులు నమోదు అయినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 కేసులు బయటపడగా… ఈ నెల 2వ తేదీ వరకు 780 కేసులు నిర్ధారణ అయ్యాయని చెప్పింది. మంకీపాక్స్ వల్ల ఈ ఏడాదిలో 7 దేశాల్లో 66 మంది మృతి చెందారని తెలిపింది.
మన దేశంలో కూడా మంకీపాక్స్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. యూపీలోని ఘజియాబాద్ లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాలిక శరీరంపై దద్దర్లు, దురద ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆమె శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు టెస్టింగ్ కోసం పంపించారు. బాలికలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.
27దేశాల్లో మంకీ పాక్స్ వైరస్ – 780కేసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement