Friday, November 22, 2024

గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా మంకీపాక్స్‌.. ప్ర‌క‌టించిన వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌

చిన్న‌గా మొద‌లైన మంకీపాక్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటి దాకా 75 దేశాల్లో 16 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరింత ఆందోళన చెందుతోంది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇవ్వాల (శనివారం) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ ప్రమాదం మధ్యస్థంగా ఉందని WHO చీఫ్‌ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అయితే.. యూరోపియన్ ప్రాంతంలో దీని ఇంపాక్ట్ కాస్త ఎక్కువే ఉందని అంచనా వేశారు. కొత్త విధానాల్లో ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విస్తరించే ముప్పు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక‌.. మంకీపాక్స్‌ వైరస్‌పై పోరాటానికి ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవరసమని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ చీఫ్‌ టెడ్రోస్ స్పష్టం చేశారు. మశూచి టీకాలు కొంత రక్షణ కలిగిస్తాయన్నారు. అయితే.. ఈ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు కొత్త టీకాలు అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు బవేరియన్ నార్డిక్ తయారు చేసిన మశూచి వ్యాక్సిన్ ‘ఇమ్వానెక్స్’ను మంకీపాక్స్‌పై పోరాటానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ శుక్రవారం సిఫార్సు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement