Tuesday, November 26, 2024

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌ హ్యూమనాయిడ్ రోబోట్.. వాస్తవిక ముఖ కవళికలు, కదలికలతో..

ప్రపంచంలోని అత్యంత అధునాతన‌ మానవ రూప రోబోట్‌ను బ్రిటిష్ ప్రయోగశాలలో ఈ మ‌ధ్య ఆవిష్కరించారు. ఈ రోబోట్‌ను “అమెకా” అని పిలుస్తున్నారు. ఇది మనుషులకు అత్యంత దగ్గరగా ఉండే ముఖ కవళికలను కలిగి ఉంది. దీన్ని బ్రిటిష్ కంపెనీ ఇంజినీర్డ్ ఆర్ట్స్ రూపొందించింది. అమెకా తన రోబోటిక్ చేతిని ఆసక్తిగా చూస్తూ భుజం తట్టిందని, యాంత్రిక అవయవాలు, సెన్సార్ శ్రేణిని మెచ్చుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

Ameca ముఖం, కళ్లు, బుగ్గలు, నోరు, నుదిటిని కలిగి ఉంటుంది. ఆశ్చర్యం నుండి ఆనందం దాకా ఎన్నో భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి రూపాన్ని మార్చుతుంది. మానవ-రోబోట్ పరస్పర చర్యలను అధ్యయనం చేయడం.. మ‌రింత మెరుగుపరచడంలో విద్యావేత్తలు, ఇంజినీర్ల‌కు హెల్ప్ చేయ‌డానికి దీన్ని రూపొందించారు. ప్రజలు ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించడానికి.. ముఖ సంకేతాలపై ఆధారపడతారు. హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ వంటి వాతావరణాల్లో పనిచేసే మానవరూప రోబోట్‌లు మానవుల వలే కనిపించి కమ్యూనికేట్ చేయగలిగితే బాగుంటుంద‌నే భావ‌న ఉంది. జనవరిలో లాస్ వెగాస్‌లో జరిగే CES 2022లో అమెకాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement