హోం గ్రౌండ్ లో చెలరేగుతున్న అమెరికా
యుఎస్ ఎ టీమ్ లో సగం మంది ఎన్ ఆర్ ఐ లే
ఆ జట్టు చేతిలో ఇప్పటికే కెనడా, పాక్ ఓటమి
పరుగుల వేటలో భారత్ కు కష్టాలు
రాత్రి 8 గంటలకు న్యూయార్క్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.విజయాలు సాధించినా బ్యాటింగ్‌లో భారత్ మెరుగుపడాల్సి ఉంది. పాక్ మ్యాచ్‌లో పరుగుల కోసం చెమటోడ్చిన టీమిండియా.. 27 పరుగులకే చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. ఆ తడబాటును అధిగమిస్తూ ఈ మ్యాచ్‌లో చెలరేగాలని భావిస్తోంది.
కోహ్లీ, సూర్యలు ఫామ్ లోకి వస్తే..
ఇక ఇండియా విషయానికి వస్తే.. విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఫామ్ లోకి రావాలని భగవంతుడిని ప్రార్థించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. బౌలింగులో బుమ్రా, పాండ్యా కీలకం కానున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. రిషబ్ పంత్ ఆట జట్టుకు సంతోషాన్నిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దళంతో పాటు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం అమెరికా బ్యాటర్లకు పెద్ద సవాలే. న్నారు. అందుకే అమెరికాను భారత్ తేలికగా తీసుకుంటే పొరపాటే అవుతుంది.
న్యూయార్క్ పిచ్‌లో ఏ మార్పు లేదు. మరోసారి తక్కువ స్కోరే నమోదు కానుంది. ఇక్కడ చిన్న లక్ష్యాలను ఛేదించడం కూడా కఠిన సవాలుగా మారుతోంది. అయితే గత మ్యాచ్‌ల్లోలా బంతి అనూహ్యంగా బౌన్స్ కాదని భావిస్తున్నారు. చేజింగ్ కష్టం కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోనుంది.
అమెరికా లో జట్టులో ఏకంగా తొమ్మిది మంది ఎర్ఆర్ ఐ లే
పసికూనగా టోర్నీలో అడుగుపెట్టిన అమెరికా వరుసగా రెండు విజయాలతో సూపర్-8 రేసులో నిలిచింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు షాకిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. కెనడాతో మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను సూపర్ ఓవర్ దాకా లాక్కొచ్చి గెలిచింది. ప్రస్తుతం అమెరికా జట్టులో సగం మంది ప్రవాస భారతీయులే ఉన్నారు. అయితే వాళ్లలో ఐదుగురు నేటి మ్యాచ్ లో ఆడనున్నారు. నిజానికి టీమ్ ఇండియా బలాలు, బలహీనతలు వాళ్లకి బాగా తెలుసు. రెండవది న్యూయార్క్ పిచ్ ఇంకా మనవాళ్లకి కొరుకుడు పడటం లేదు. కొమ్ములు తిరిగిన విరాట్ కొహ్లీ లాంటి బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోతున్నారు.
అటువైపు అమెరికాకు సొంత మైదానం కావడం కలిసి వచ్చేలా ఉంది. వారికి డ్రాప్ ఇన్ పిచ్ లపై ఆడిన అనుభవం ఉంది. ఈజీగా రన్స్ తీస్తున్నారు. అందుకని టీమ్ ఇండియా కొంచెం జాగ్రత్తగానే ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టు ఏదైనా సరే.. సూపర్ 8 కి డైరక్టుగా వెళుతుంది.
ఇక అమెరికా టీమ్ లో భారత సంతతి ఆటగాళ్లయిన సౌరభ్ నేత్రావాల్కర్, హర్మీత్ సింగ్, నితీశ్ కుమార్, కెప్టెన్ మోనాంక్ పటేల్, జస్ దీప్ సింగ్ ఉన్నారు. పాకిస్తాన్ మ్యాచ్ లో మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ చేశాడు. నేత్రా వాల్కార్ సూపర్ ఓవర్ వేసి గెలిపించాడు. వీరు కాకుండా అమెరికా స్పిన్నర్ కెంజిగేతో అప్రమత్తంగా ఉండాలి. తనకి సులువుగా వికెట్లు వస్తున్నాయి. వీరిని ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా ప్రణాళికలు రచించాలి.
అయితే భారత్- అమెరికా మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఎందుకంటే అమెరికాలాంటి అగ్రదేశం క్రికెట్ లో తొలిసారి అడుగుపెట్టింది. అందువల్ల ఆ దేశం గెలుస్తుంటే, వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అలా క్రికెట్ కి మంచి జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
అమెరికా: స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్, ఆంద్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్‌దీప్ సింగ్, కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.