Friday, November 22, 2024

వరల్డ్​ బెస్ట్ ఇంక్యుబెటర్ టీహబ్ 2.. ఇవ్వాల ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్-2 ని ఇవ్వాల సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఐటీ కారిడార్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విశాలమైన ఐదు రోడ్ల కూడలిలో టీ-హబ్ నిర్మించారు. మూడెకరాల్లో 276 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఐటీ హబ్-2ను తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యూ బెటర్ టీ హబ్-2 దేశంలోనే అతిపెద్దది. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా టీ హబ్2ని తీర్చిదిద్దారు. టీ హబ్‌-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్నిరకాల మౌలిక వసతులు క‌ల్పించింది తెలంగాణ ప్ర‌భుత్వం.

ఇన్నోవేషన్ ఎకో సిస్టంను బలోపేతం చేసేందుకు తోడ్పాడునిచ్చేలా, దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు పొందుతోంది టీహ‌బ్‌. 2015లో స్టార్టప్‌లను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించేందుకు ఐటీ శాఖ ఐటీ హబ్ ప్రస్థానం ప్రారంభమైంది. కాగా, టీ-హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు.

01) దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా వచ్చే రోడ్డు
02) మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి వచ్చే రోడ్డు
03) రహేజ మైండ్‌ స్పేస్‌ నుంచి రాయదుర్గం బయోడైవర్సిటీ చౌరస్తాను కలిసి రోడ్డు
04) రాయదుర్గం- మాదాపూర్‌ వెళ్లే రోడ్డు
05) పాత ముంబై హైవేను కలిపే రోడ్డు.

ఇలా మొత్తం 5 విశాలమైన రోడ్లతో కూడలి ఉండటం టీహ‌బ్ ప్రత్యేకత. హైదరాబాద్ సిటీ నలుమూలల నుంచి ఏ మార్గంలో వచ్చినా టీ హబ్‌కు ఈజీగా చేరుకోవ‌చ్చు. మొత్తం పది అంతస్తుల్లో నిర్మించిన ఈ టి హబ్ బిల్డింగ్‌లో ప్రస్తుతం ఐదు అంతస్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement