తెలుగు సినీ ఇండస్ట్రీలో అతను సుపరిచితుడు. పొలిటికల్ సర్కిళ్లలోనూ అందరికీ ఆయనంటే బాగా తెలుసు.. ఎందుకంటే అతని నుంచి ఎప్పుడు ఎట్లాంటి కామెంట్స్ వస్తాయో.. ఆయనేం మాట్లాడుతారో అని మీడియాతో పాటు, తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇంతకీ ఆయనెవరో చెప్పకుండా ఈ సోది ఎందుకంటారా? చెప్తామండీ.. ఆ మాత్రం ఎలివేషన్ లేకుంటే అన్న ఫీలైపోడూ.. ఆ మాత్రం చెప్పుకోకుంటే అతని వ్యాల్యూ తగ్గించినవాళ్లం అవుతాము కదా!!.. ఆయనేనండీ బాబూ మన బండ్ల గణేష్ అన్నా..
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
ఇక విషయంలోకి వస్తే.. బండ్ల గణేశ్ తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై, ఆ తర్వాత కామెడీ పండించారు. కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీ గొప్పగా చెప్పుకునేలా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరిట మంచి సినిమాలే నిర్మించారు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌ని దేవుడిలా కొలుస్తారు కూడా.. అట్లాంటి బండ్ల గణేషన్న ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీకి సై అన్నారు. ఆ తర్వాత ఇక పొలిటికల్ సర్కిళ్లలో మళ్లీ తన వాయిస్ వినిపంచలేదు. చాలాకాలంగా సైలెంట్‌గానే ఉంటున్నారు.
కానీ, ఈ మధ్య రెండు, మూడు రోజులుగా మళ్లీ బండ్ల గణేష్ బీజేపీలో చేరుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన మరోసారి న్యూస్ చానళ్లకు, మీడియాకు హాట్ టాపిక్ అయ్యారు. గణేషన్న గురించి స్పెషల్ బులెటిన్లు, టాక్ షోలు రన్ చేసే లెవల్లో పలు చానాళ్లు ప్లాన్ చేసుకున్నాయి. కొన్నయితే డిబేట్లు కూడా రన్ చేయాలని అనుకుంటున్నాయి.
అయితే.. ఇంతలోనే ఇవ్వాల (మంగళవారం) కాసేపటి క్రితం ఏమనుకున్నడో ఏమో కానీ, మన బండ్ల గణేషన్న మళ్లీ ఆలోచన మారినట్టుంది. తనకు గాంధీ ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమని, ‘‘ఐ లవ్ గాంధీ ఫ్యామిలీ, ఐ విల్ బి విత్ గాంధీ ఫ్యామిలీ” అంటూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పేలుతున్నాయి. డిఫరెంట్ మీమ్స్ కట్‌చేసి వదులుతున్నారు మీమర్స్..