Friday, November 22, 2024

IND vs NZ : ఐసీసీ ప్రపంచ కప్‌.. నేడు కివీస్‌తో భారత్‌ పోరు

ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ 2022లో భాగంగా నేడు (గురువారం) భారత్‌ మహిళల జట్టు.. ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో తలపడనుంది. అయితే టీమిండియా జట్టు బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కివీస్‌తో 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్‌ ఫెర్న్స్‌ 32 విజయాలు సాధించగా.. భారత్‌ 20 మ్యాచుల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. దీని ప్రకారం చూసుకుంటే.. వన్డేల్లో కివీస్‌దే పైచేయి ఉంది. సెడాన్‌ పార్కు వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే ప్రపంచ కప్‌లో చూసుకుంటే కూడా న్యూజిలాండ్‌దే పైచేయి ఉంది. విశ్వ కప్‌ పోరులో న్యూజిలాండ్‌తో మిథాలీ సేన 9సార్లు తలపడింది. ఇందులో ఏడుసార్లు వైట్‌ఫెర్న్స్‌ గెలుపొందగా.. రెండు సార్లు భారత్‌ విజయం సాధించింది. అయితే కివీస్‌ మహిళల జట్టుపై టీమిండియా కెప్టెన్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. మిగిలిన వారితో పోలిస్తే.. మిథాలీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

ఇప్పటి వరకు 273 పరుగులు చేసింది. ప్రపంచ కప్‌లో పోటీపడినప్పుడు మిథాలీయే సెంచరీ బాదింది. 2017 ప్రపంచ కప్‌ టోర్నీలో 109 పరుగులు చేసింది. అయితే ఇక్కడ అంకెలు చూసుకోకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. 2017లో చివరి సారిగా ఇరు జట్లు తలపడగా.. మిథాలీ సేనయే.. 189 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించింది. సెమీస్‌లో అడుగుపెట్టింది. 109 రన్స్‌ చేసిన మిథాలీ రాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఘన విజయం సాధించిన భారత్‌, న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement