Friday, November 22, 2024

Women’s World Cup 2022: విజృభించిన మిథాలీ సేన.. ఆస్ట్రేలియా టార్గెట్ 278 రన్స్

ఐసీసీ మహిళల ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా మొద‌ట బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో మిథాలీ సేన బ్యాటింగ్ చేసింది. భార‌త బ్యాట‌ర్లు స‌మిష్టిగా రాణించడంతో నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్టపోయి 277 ప‌రుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త మహిళ జట్టు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఓపెన‌ర్లు స్మృతి మందాన (10), షెఫాలి వ‌ర్మ (12) పరుగుల‌కే పెవిలియ‌న్ బాట పట్టారు. త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన యంస్తిక బాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్ (68), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (57 నాటౌట్) రాణించారు. ఈ ముగ్గ‌రు నిల‌క‌డ‌గా రాణించి భారత్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. దీంతో భార‌త ఉమెన్స్ జ‌ట్టు 277 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలంటే.. 278 ప‌రుగుల చేయాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియా బౌల‌ర్లు డార్సీ బ్రౌన్ 3 వికెట్లు ప‌డ‌గొట్టగా.. అలాన కింగ్ 2, జెస్ జొనాసెన్ ఒక వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement