మహిళలు కబడ్డీ ఆడారు.ఇందులో వింతేముందీ అనుకుంటున్నారా..అందరూ చీరలు కట్టి మరీ ఈ ఆటని ఆడటం విశేషం. ఛత్తీస్ గఢ్ లోని గ్రామీణ ప్రాంతంలో ఈ ఆట జరిగింది. చుట్టూ పెద్ద సంఖ్యలో జనం నిలబడి చూస్తుండగా.. మధ్యలో గీసిన కబడ్డీ కోర్టులో ఉత్సాహంగా ఆడటం ఈ వీడియోలో కనిపిస్తుంది. కొంగు జారిపోతుంటే కప్పుకొంటూ కబడ్డీ ఆడటం గమనార్హం. చుట్టూ ఉన్న జనం ఉత్సాహంగా కేకలు వేస్తూ మహిళలను ప్రోత్సహించారు.ఛత్తీస్ గఢ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘మేం ఎవరికన్నా తక్కువా.. ఛత్తీస్ గడ్ ఒలింపిక్స్ లో మహిళల కబడ్డీ ఇది (హమ్ కిసీ సే కమ్ హై క్యా. ఛత్తీస్ ఘడియా ఒలింపిక్ మే మహిళా కబడ్డీ)’ అని హిందీలో క్యాప్షన్ పెట్టారు.ఈ వీడియోకు ఇప్పటివరకు మూడు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు, రీ ట్వీట్లు కూడా వస్తున్నాయి. ఆ మహిళలకు నెటిజన్ల నుంచి భారీగా ప్రశంసలు వస్తున్నాయి.మహిళలు చీరలో కబడ్డీ ఆడినా.. ప్రొఫెషనల్ ఆటగాళ్లలా ఉన్నారు. వారిలో ఉత్సాహం చూస్తుంటే భలేగా ఉంది’ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.మా ప్రాంతాల్లోనూ ఇలా మహిళలు కబడ్డీ ఆడుతారు. అలాగని వీళ్లను తక్కువ చేయడం లేదు. కబడ్డీ చాలా బాగా ఆడుతున్నారని మరికొందరు చెబుతున్నారు.
చీరలతో కబడ్డీ ఆడిన మహిళలు-వైరల్ గా వీడియో-మూడు లక్షలకు పైగా వ్యూస్
Advertisement
తాజా వార్తలు
Advertisement