- గర్భ విచ్ఛిత్తి గడువు పెంపు.. 20 నుంచి 24 వారాలు
ప్రభన్యూస్ న్యూఢిల్లీ: అబార్షన్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది. ఈ మేరకు మార్చిలో లోక్‌సభ ఆమోదించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) చట్టం–2021ను నోటిఫై చేసింది. కొన్నివర్గాల మహిళలు అబార్షన్ చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతున్నట్లు పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం.. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో భర్త చనిపోయిన వారు, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యంతో ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినప్పుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారు 24 వారాల్లోగా అబార్షన్ చేసుకోవచ్చు.