పంఖూరి శ్రీవాస్తవ హార్ట్ ఎటాక్ తో మరణించారు. ఆమె వయసు 32సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఆమె మరణించడం విషాదకరం. పంఖూరి శ్రీవాస్తవ సిఈవోగా ఎంతో రాణించారు. ఆమె హఠాత్త్ మరణం మమ్మల్ని కలిచి వేసిందని పంఖూరి కంపెనీ సంతాపం వ్యక్తం చేసింది. మా ప్రియమైన సీఈవోని కోల్పొయాం, ఆమె ఆత్మ సద్గతిని పొందుగాక. ఓం శాంతి అని ట్వీట్ చేశారు. పంఖురి అనేది భారతదేశంలోని మహిళలకు లైవ్ స్ట్రీమింగ్, చాట్ , మైక్రో-కోర్సుల ద్వారా ఆన్‌లైన్‌లో నెట్‌వర్క్ చేయడానికి, నేర్చుకోవడానికి , షాపింగ్ చేయడానికి సీక్వోయా క్యాపిటల్-ఆధారిత సామాజిక కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ గా ఉంది.
కాగా పంఖూరి శ్రీవాస్తవకి ట్విట్టర్‌లో సంతాపం తెలిపిన వారిలో సెక్వోయా క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ కూడా ఉన్నారు. “పంఖూరికి చాలా ఆలోచనలు, దూరదృష్టి కలిగినదని చిన్న వయసులో శ్రీవాస్తవ మరణం ఎంతో బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ఝాన్సీలో జన్మించిన ఆమె రాజీవ్ గాంధీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ,టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాం కింద ముంబైలోని మునిసిపల్ పాఠశాలల్లో బోధించారు. శ్రీవాస్తవ సంవత్సరం క్రితం వివాహం చేసుకుంది. డిసెంబర్ 2 న తన మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..