Saturday, November 23, 2024

ఉత్తరప్రదేశ్​లో ఘోరం.. ‘ట్రిపుల్​ తలాక్​’ తర్వాత మహిళపై అన్నదమ్ముల గ్యాంగ్​ రేప్​

ఉత్తరప్రదేశ్​లో ఓ మహిళపై పలుమార్లు గ్యాంగ్​రేప్​కి పాల్పడిన కేసులో నిందితుల కోసం పోలీసులు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు. ఒక మహిళకు ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పిన తర్వాత ఆమె భర్త, అతని తమ్ముడు కలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్​ సంజయ్​కుమార్​చెప్పారు. ఈ ఆరోపణలపై ఒక మత గురువుతో సహా అనేక మంది వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తనకు ఐదేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తితో వివాహమైంది. చట్టవిరుద్ధమైన ‘ట్రిపుల్ తలాక్’ విధానంలో సల్మాన్ కొన్ని నెలల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీనిలో ఒక మత గురువు గుడ్డు హాజీ ప్రమేయం ఉంది. అతని సూచన మేరకు సల్మాన్, తన తమ్ముడు అయిన ఇస్లామ్​ని పెళ్లి చేసుకోవాలని, అతనితో విడాకులు తీసుకుంటే తాను మళ్లీ తన భార్యగా స్వీకరిస్తానని చెప్పాడు అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే.. సల్మాన్​ చెప్పినట్టుచేసిన తర్వాత కూడా తమ్ముడు ఇస్లామ్​ ఆమెకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించాడని, ఈ క్రమంలో సోదరులిద్దరూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇక.. సల్మాన్ హామీ మేరకు ఆ మహిళ అతని సోదరుడు ఇస్లాంను వివాహం చేసుకుంది. కానీ, ఇస్లాం విడాకులు ఇవ్వలేదు. అప్పటి నుండి సల్మాన్, ఇస్లాం ఇద్దరూ కలిసి తనపై అనేక సందర్భాల్లో సామూహిక అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది.. అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ చెప్పారు.

ఆ మహిళ తన ఫిర్యాదుతో స్థానిక కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా తాము గుడ్డు హాజీ, సల్మాన్, ఇస్లాం అనే ముగ్గురితోపాటు వారి కుటుంబ సభ్యులపై గ్యాంగ్ రేప్, అసహజ సెక్స్ సెక్షన్లతో పాటు ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  మహిళను వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్​ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement