– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తనకు ఐదేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తితో వివాహమైంది. చట్టవిరుద్ధమైన ‘ట్రిపుల్ తలాక్’ విధానంలో సల్మాన్ కొన్ని నెలల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీనిలో ఒక మత గురువు గుడ్డు హాజీ ప్రమేయం ఉంది. అతని సూచన మేరకు సల్మాన్, తన తమ్ముడు అయిన ఇస్లామ్‌ని పెళ్లి చేసుకోవాలని, అతనితో విడాకులు తీసుకుంటే తాను మళ్లీ తన భార్యగా స్వీకరిస్తానని చెప్పాడు అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే.. సల్మాన్ చెప్పినట్టుచేసిన తర్వాత కూడా తమ్ముడు ఇస్లామ్ ఆమెకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించాడని, ఈ క్రమంలో సోదరులిద్దరూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇక.. సల్మాన్ హామీ మేరకు ఆ మహిళ అతని సోదరుడు ఇస్లాంను వివాహం చేసుకుంది. కానీ, ఇస్లాం విడాకులు ఇవ్వలేదు. అప్పటి నుండి సల్మాన్, ఇస్లాం ఇద్దరూ కలిసి తనపై అనేక సందర్భాల్లో సామూహిక అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది.. అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ చెప్పారు.
ఆ మహిళ తన ఫిర్యాదుతో స్థానిక కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా తాము గుడ్డు హాజీ, సల్మాన్, ఇస్లాం అనే ముగ్గురితోపాటు వారి కుటుంబ సభ్యులపై గ్యాంగ్ రేప్, అసహజ సెక్స్ సెక్షన్లతో పాటు ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.