Tuesday, November 19, 2024

నాలుగు కాళ్ల‌తో జ‌న్మించిన చిన్నారి.. శిశువు ఆరోగ్యంగానే ఉంద‌న్న వైద్యులు

నాలుగు కాళ్ల‌తో జ‌న్మించింది ఓ చిన్నారి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ్వాలియ‌ర్ జిల్లా సికంద‌ర్ కాంపూలో చోటు చేసుకుంది.ఈ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ పురుటి నొప్పులతో కమల్‌ రాజ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు పుట్టిన పాపకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం పసికందు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువు నాలుగు కాళ్లతో పుట్టింది. ప్రస్తుతం 2.5 కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉంది. చిన్నారికి శారీరక వైకల్యం ఉంది. దీన్ని ఇస్కియోపాగస్ అంటారు.

పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరం రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. శిశువుకు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. అయితే, ఆ కాళ్లు పనిచేయడంలేదు. చిన్నారిని పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శరీరంలో ఇతర వైకల్యం ఏమైనా ఉందా అన్నదానిపై టెస్టులు చేస్తున్నారు. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స ద్వారా అదనంగా ఉన్న రెండు కాళ్లను తొలగిస్తారు. అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపగలదుని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌కేఎస్‌ థకడ్ వెల్ల‌డించారు. ఇప్పుడీ చిన్నారి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement