రాంగ్ కాల్స్ ద్వారా ఓ మహిళ పరిచయం అయ్యింది. రోజూ ఫోన్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. ముఖ పరిచయం లేకున్నా వారు మానసికంగా ఎంతో దగ్గరయ్యారు. దాంతో ఆ మహిళ తన పర్సనల్ ఫొటోలను అతనితో షేర్ చేసుకుంది. ఆ క్రమంలోనే ఆమె ఈ మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్లను సేకరించిన ఆ వ్యక్తి ఇక ఆమెతో బేరాలకు దిగాడు. తనకు జాబ్ పోయిందని, అత్యవసరంగా 50వేలు కావాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు అందరికీ పంపించి ఇజ్జత్ తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు..
తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని ఓ మహిళను డబ్బులకోసం వేధించాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని థేని జిల్లాలో జరిగింది. నిందితుడిని కన్నిసెర్వపట్టి గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఫోన్ ద్వారా బాధిత మహిళకు మనోజ్ పరిచయమయ్యాడు. రాజ్ అనే పేరుతో ఆమెకు పరిచయమై ఆమెకు తన మాటలతో మరింత దగ్గరయ్యాడు. ఆ మహిళ తన ఫోటోలు, వీడియోలు అతనికి పంపింది.
ఆ తర్వాత తన జాబ్ పోయిందని 50 వేలు డబ్బు పంపాలని ఆ మహిళను కోరాడు. దీంతో అప్పటికప్పుడు తన దగ్గరున్న 20 వేలను మనోజ్ అకౌంట్ కు ఆమె ట్రాన్ఫ్‌ఫర్ చేసింది. మిగతా 30 వేలు కూడా ఇవ్వాలని లేకుంటే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను ఆమె బంధువులు, కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించాడు. దీంతో ఆందోళనపడ్డ బాధితురాలు పోలీసులకు కంప్లెయింట్ చేసింది. ఈ తతంగాన్ని అంతా ఎంక్వైరీ చేసిన పోలీసులు నిందితుడు మనోజ్ అలియాస్ రాజ్‌ను అరెస్ట్ చేశారు.