ఓ 32 ఏళ్ల విజయ కులకర్ణి అనే మహిళ సౌండ్ ఎక్కువగా పెట్టుకుని టీవీ చూస్తోంది. ఆ సమయంలోనే ఆమె అత్తగారు (60) వృశాలి కులకర్ణి అదే ఇంట్లో దేవుడి భజనలు చదువుతున్నారు. ఇంతలో ఆమె కోడలు విజయ కులకర్ణి మరింత సౌండ్ పెంచిందని, దాంతో కాస్త సౌండ్ తగ్గించమ్మా అన్నందుకే అత్తపై కోడలు దాడికి దిగిందని శివాజీ నగర్‌కు పోలీసు అధికారి తెలిపారు.
సోమవారం ఉదయం వృశాలి భజనలు పాడుతున్నప్పుడు టెలివిజన్ సౌండ్ తగ్గించమని విజయని కోరడంతో వారి మధ్య గొడవ జరిగింది. అయితే.. రిమోట్ తీసుకున్న ఆ వృద్ధురాలు వృశాలి టెలివిజన్ సెట్ ఆపేయగా.. కోపం తాళలేని కోడలు విజయ అత్తగారి చేయి పట్టుకుని మూడు వేళ్లను కొరికింది. దీంట్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా ఆమె చెప్పుతో కొట్టింది అని పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలి చేతి వేళ్లు తెగలేదని అధికారులు తెలిపారు. అత్త వృశాలి ఫిర్యాదు మేరకు కోడలుపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.