బిజెపిలో దళితులకు సరైన స్థానమే లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. బిజెపికి భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజస్ధాన్‌లోని ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న నవసంకల్ప్ చింతన్ శిబిర్‌లో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండటమనేది కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉందని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రజలతో పార్టీకి సంబంధాలు తెగిపోయాయన్న ఆయన.. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనన్నారు. ప్రజలతో నేరుగా సంబంధాల పునరుద్ధరణకు యత్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యత్నం ఒక్కరోజో, రెండు రోజుల్లోనో ముగియరాదన్న రాహుల్.. నెలల తరబడి కష్టపడాల్సిందేనని చెప్పారు.దేశాన్ని ముందుకు నడిపించే సత్తా ఒక్క కాంగ్రెస్‌కే ఉందన్న నమ్మకం ప్రజల్లో ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని ఆయన తెలిపారు. బీజేపీపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement