Friday, November 22, 2024

Good News: ఆడాళ్లపై ఆంక్షల విషయంలో వెనక్కి.. సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం

మహిళల విషయంలో గతంలో అమలు చేసిన కఠిన ఆంక్షల నుంచి సౌదీ అరేబియా ఒక్కో మెట్టు దిగుతోంది. నాలుగేళ్ల క్రితం మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సౌదీ మహిళలు ట్యాక్సీలు కూడా నడపవచ్చని, ట్యాక్సీ డ్రైవర్లుగా మారడానికి పర్మిషన్ ఇస్తూ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  రియాద్, జెద్దా, జజాన్, అసిర్, నజ్రాన్, జౌఫ్, హేల్, తైఫ్‌లతో సహా కింగ్డమ్‌లోని నగరాల్లోని 18 డ్రైవింగ్ స్కూల్‌లలో ఏదైనా ఒక సాధారణ టాక్సీ లైసెన్స్ కోసం మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన పేర్కొంది.

లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు సౌదీ రియాల్ 200 (రూ. 3,959) చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఇవ్వనున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. 2017లో డ్రైవింగ్ హక్కు మంజూరు చేసినప్పటి నుంచి రైళ్లు, విమానాలు, రేసింగ్ కార్లతో సహా సౌదీ మహిళలకు రవాణాలో అనేక కెరీర్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఉబెర్, కరీమ్ వంటి యాప్‌లకు డ్రైవర్లుగా పనిచేయడానికి మహిళలకు చాన్స్ దొరికింది.

గతంలో మహిళలపై ఎక్కడా లేని కఠిన ఆంక్షలు విధించిన సౌదీ అరేబియా తొలుత మగతోడు లేకుండా ఒంటరిగా ప్రయాణాలు కూడా చేయవద్దనే ఆంక్షలను అమలు చేసేది. కాగా, కార్లు నడపడం, ప్లే గ్రూప్‌లు, స్టేడియంలలోకి ప్రవేశించడం వంటివి గతంలో పురుషులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కాగా, వీటన్నిటినీ ఇప్పుడు  మహిళలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వచ్చిన మార్పులతో క్రమంగా ఆంక్షలను తొలగిస్తూ మహిళలకు అవకాశాలను కల్పిస్తోంది. సౌదీ తీసుకున్న తాజా నిర్ణయంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement