Friday, November 22, 2024

చివరి దశలో సెలా టన్నెల్ 1 పనులు.. ఆఖరి బ్లాస్ట్ చేసిన అధికారులు

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో ఉన్న సెలా టన్నెల్ ప్రాజెక్ట్ లో తవ్వకం పనిని పూర్తి చేసింది. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం మధ్య BRO ఈ ఫీట్‌ను సాధించింది. 980 మీటర్ల పొడవైన సొరంగం (టన్నెల్ 1) కోసం డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ (DGBR) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి చివరి పేలుడును న్యూ ఢిల్లీ నుండి నిర్వహించారు. 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన పొడవైన సొరంగాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ లో బిసిటి రోడ్ నుండి బయలుదేరే టన్నెల్ 1కి ఏడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు, టన్నెల్ 1 నుండి టన్నెల్ 2ని కలిపే 1.3 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మాణం కూడా ఉంది.

2019లో ప్రధాని నరేంద్ర మోడీ సెలా టన్నెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది జనవరి 15వ తేదీన DGBR ద్వారా మొదటి పేలుడు జరిపి టన్నెల్ 1పై తవ్వకం పని ప్రారంభించారు. ఆ తర్వాత గత అక్టోబర్ 14న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 1,555 మీటర్ల టన్నెల్ 2 కు సంబంధించిన పేలుడును ఇండియా గేట్ నుండి వర్చువల్ గా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement