Wednesday, November 20, 2024

Lockdown: తమిళనాడులో పూర్తి స్థాయి లాక్‌డౌన్!

రాష్ట్రంలో కరోనా మళ్లీ భారీగా పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపటి(జనవరి 9) నుంచి లాక్‌డౌన్ అమలులోకి రానుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8,981 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 4,531 కొత్త కేసులు వెలుగుచేశాయి. కోవిడ్ తో 8 మంది బాధితులు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చెంగల్‌పేట్‌లో 1,039 కొత్త కేసులు నమోదయ్యాయి, తిరువళ్లూరు 514, కోయంబత్తూరు 408, కాంచీపురం 257, వెల్లూరు 216, తిరుచిరాపల్లి 184, టుటికోరిన్ 160, మదురై 149, తిరుప్పూర్ 127, సేలం 113, రాణి తిరుపేట 119, కన్యాకుమారి 111, కన్యాకుమారి 111, కన్యాకుమారి 111, ఈరోడ్ 103 కేసులు నమోదు అయ్యాయి.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా జనవరి 6 నుంచి అమలులోకి వచ్చిన రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ఆదివారాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌లు జనవరి 20 వరకు అమలులో ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ జనవరి 9 నుండి అమలులోకి వచ్చేలా ఆదివారం సబర్బన్ రైళ్ల షెడ్యూల్‌ను సవరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement