Thursday, November 21, 2024

శీతాకాలంలో వెచ్చ‌ద‌నం కోసం ‘ఎల‌క్ట్రిక్ బ్లాంకెట్స్’

వేస‌వికాలంలో చ‌ల్ల‌ద‌నం కోసం ఏసీ, కూల‌ర్లు వాడ‌తాం. మ‌రి చ‌లికాలంలో వెచ్చ‌ద‌నం కోసం ఏం వాడ‌తాం వారి వారి తాహ‌త్తుకి త‌గ్గ‌ట్టుగా రూం హీట‌ర్స్ లేదా దుప్ప‌ట్లు వాడ‌తారు. అయితే అంద‌రూ రూం హీట‌ర్స్ ని వాడ‌లేరు క‌దా. ఎక్కువ శాతం మంది దుప్ప‌ట్లవైఏ మొగ్గు చూపుతుంటారు. అయితే మీకు ఎల‌క్ట్రిక్ బ్లాంకెట్ గురించి తెలుసా. ఈ ర‌కం దుప్ప‌ట్లు షాక్, అధిక వేడి నుండి కాపాడుతుంద‌ట‌. ఇది చాలా ఆకర్షణీయమైన రంగుల్లో ల‌భించే డబుల్ బెడ్ బ్లాంకెట్. అంతేకాదు ఎల‌క్ట్రిక్ దుప్ప‌ట్లు తేలిక‌గా, మెత్త‌గా కూడా ఉంటాయి. ఇవి డ‌బుల్ బెడ్ సైజులో లభిస్తాయి కూడా. ఇది 185x155cm ప‌రిమాణంలో ఉండే ఎలక్ట్రిక్ దుప్పటి.

ఇది షాక్‌ప్రూఫ్ రక్షణతో వస్తుంది. దీనితో పాటు, వేడిని తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ లో మాన్యువల్ హీట్ కంట్రోలర్ ఆప్ష‌న్‌ కూడా ఇచ్చారు. ఇది పాలిస్టర్ మెటీరియల్‌తో తయారు చేయబడింది. ఈ దుప్ప‌టిని ఉప‌యోగించ‌డం ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత వేడి అవుతుంది. ఇది పోలార్ ఫాబ్రిక్‌తో తయారు చేయబడింది. 150 x 160 సెం.మీ సైజులో లభిస్తుంది. ఇది 100 శాతం సురక్షితం కూడా.ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ లో, 3 విభిన్న హీట్ సెట్టింగ్‌లు అందించబడుతున్నాయి. మీ ఇష్టం ప్రకారం మీరు వీటిని సులభంగా నియంత్రించవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో ఉంటుంది. మీరు కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇది ఎలక్ట్రిక్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement