Friday, November 22, 2024

Winning Combo – తెలంగాణ కాంగ్రెస్ కు డి కె బూస్ట్ ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల్లో అంతా తానై చక్రం తిప్పుతున్నట్టు- ఇటీ-వల జరుగుతున్న పరిణామాల బట్టి తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో శివకుమార్‌ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో విభేదాలున్నప్పటికీ వాటిని పక్కకు పెట్టి కాంగ్రెస్‌ పార్టీని విజయతీరాలకు తీసుకురాడంలో ఆయన కీలక భూమిక వహించారు. కర్ణాటకలో అమలు చేసిన విధానాలనే తెలంగాణాలో ప్రయోగించేందుకు కాంగ్రెస్‌ అధినాయకత్వం శివకుమార్‌ను రంగంలోకి దింపినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో రెండు వారాల తర్వాత శివకుమార్‌ తెలంగాణాలో పూర్తి స్థాయిలో మకాం వేసి ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడంతో పాటు- నేరుగా ఎన్నికల రణక్షేత్రంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఉంటూ జిల్లాల వరుస పర్యటనలకు ఆయన శ్రీకారం చుడతారని చెబుతున్నారు. జిల్లాల పర్యటన, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసి పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తారని, ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ-కి పెట్టే అభ్యర్థులు ఎవరన్న విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం అందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు- ప్రచారం జరుగుతోంది. కాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌కు చెందిన భారాస ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్‌ రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్పించే విషయంలోనూ శివకుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్టు- చెబుతున్నారు. ఈ ముగ్గురు నేతలను వెంటబెట్టు-కుని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లి శివకుమార్‌ నివాసంలో ఆయనకు పరిచయం చేసి సమాలోచనలు జరిపినట్టు- ప్రచారం జరుగుతోంది. శివకుమార్‌తో భేటీ- తర్వాతే పొంగులేటి, జూపల్లి, కూచుకుంట్ల తదితరులు హైదరాబాద్‌ తిరిగివచ్చి పార్టీ సీనియర్లు మల్లు రవి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర ఏఐసీసీ బాధ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి చర్చలు జరిపినట్టు- తెలుస్తోంది. శివకుమార్‌ సూచన మేరకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనుకున్న ఈ ముగ్గురు నేతలు రాష్ట్రస్థాయి నేతలతో భేటీ- అయ్యారని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉంటు-ందని, ప్రాంతీయ పార్టీలతో ఒరిగేది శూన్యమని శివకుమార్‌ సమాలోచనల సందర్భంగా వ్యాఖ్యానించినట్టు- సమాచారం. తెలంగాణాలో భారాస పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా మరో నాలుగు నెలలు మాత్రమే ఉంటారని చెప్పినట్టు- సమాచారం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అయితే కేసీఆర్‌ అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకువెళదామని, అందుకు పార్టీ ఉధృతంగా ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నట్టు- సమాచారం. భారాసకు చెందిన కొందరు కీలక నేతలు సైతం తనకు అందుబాటు-లో ఉన్నారని, సరైన సమయంలో వారంతా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుంటారని శివకుమార్‌ అన్నట్టు- తెలుస్తోంది.

- Advertisement -

ఒక్కసారిగా కాంగ్రెస్‌లో పెరిగిన వేడి
తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరటం దాదాపు తథ్యమనే అంశం తెరపైకి రావడంతో వేడి మరింత రాజుకున్నట్లయింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈ ముగ్గురు నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి.. -పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లినట్టు- తెలుస్తోంది. కర్నాటక డిప్యూటీ- సీఎం డీకే శివకుమార్‌ నివాసంలో చర్చలు జరిగినట్టు- సమాచారం. వీళ్ల చేరిక, పార్టీలో గౌరవానికి సంబంధించి హైకమాండ్‌ పెద్దలతో శివకుమార్‌ చర్చించినట్టు- తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఈ నాయకులు అధికారిక ప్రకటన చేయనున్నట్టు- చెబుతున్నారు.

కాంగ్రెస్‌తో పోరాడే సత్తా భారాసకు లేదు
కాంగ్రెస్‌తో పోరాడే సత్తా, అధికార పార్టీ భారాసకి లేదని పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన పాత మిత్రులందరినీ తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. పొంగులేటి, జూపల్లి చేరనున్నారని ప్రచారం జరుగుతున్న సందర్భంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ, కర్నాటక తరహా ఫార్మూలాతోనే తాము తెలంగాణలో ముందుకు వెళ్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని స్పష్టం చేశారు. టికెట్ల విషయమై తాను ప్రియాంక గాంధీతోనూ మాట్లాడానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదినని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఈ నెల 18 లేదా 19న నల్లగొండలో ప్రియాంక గాంధీతో సభ నిర్వహించనున్నట్లు- తెలిపారు. షర్మిల పార్టీలోకి చేరతామంటే బేషరతుగా ఆహ్వానిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ఎంతో బలంగా ఉంది: శ్రీధర్‌బాబు
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే, సీనియర్‌ నేత దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. తమ పథకాలను ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేర్చే బృహత్‌ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement