తెలంగాణలో లో ఇవాళ, రేపు రెండు రోజులపాటు మద్యం షాపులు తెరిచి ఉండడం లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు మద్యం షాపులను మూసేస్తున్నారు. ఈనెల 29,30 వ తేదీలు హోళీ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోలీ వేడుకల్లో పాల్గొనేవారు మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు హోళీ వేడుకలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోళీ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లు, రెస్టారెంట్లకు హోళీ నిర్వహణపై నోటీసులు ఇచ్చారు. అలానే, నగరంలోని గేటెడ్ కమ్మూనిటీలపై కూడా పోలీసులు కన్నేసి ఉంచారు. ఎవరింట్లో వారు హోళీ చేసుకోవాలని, కరోనా దృష్ట్యా ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడానికి పోలీసులు సిద్ధమయ్యారు.
ఇవాళ, రేపు వైన్స్ క్లోజ్
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement