విండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా పటిష్టమైన స్కోరు చేసింది. ప్రారంభంలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయినా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ కుదురుగా ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 50 పరుగులు చేసిన తర్వాత కాస్త దూకుడు పెంచే క్రమంలో రిషబ్ పంత్ అనుకోని బంతిని పుల్ చేయబోయి బ్యాట్ ఎడ్జ్‌కి బంతి తగలడంతో కీపర్ క్యాచ్ అయ్యి అవుటయ్యాడు. నిరాశతో పెవిలియన్ చేరాడు పంత్..
ఆ తర్వాత శ్రేయస్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్ జతయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ జోష్ మీద ఉండగానే 80 పరుగుల వద్ద సిక్స్ బాదబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ తో కలిసి సుందర్ కాసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఆ తర్వాత పెద్దగా పరుగులేమీ లేకుండా టీమిండియా 50 ఓవర్లలో అలౌట్ అయ్యింది. మొత్తంగా 265 పరుగులు చేసి విండీస్ ప్లేయర్లకు 266 రన్స్ టార్గెట్‌గా పెట్టారు మన కుర్రాళ్లు. ఇక విండీస్ బౌలర్లు కూడా బాగానే ఆడారని చెప్పవచ్చు జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీయగా, జోసెఫ్, వాల్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.