Friday, November 22, 2024

Alert | హైద‌రాబాద్‌లో గాలి దుమారం.. హైకోర్టు ఏరియాలో వ‌డ‌గ‌ళ్ల వాన‌

హైదరాబాద్ సిటీలో ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం పలుచోట్ల తేలికపాటి వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. నాంపల్లి, హైకోర్టు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. చంచల్‌గూడ, సైదాబాద్‌, చంపాపేట, గోషామహల్‌, బేగంబజార్‌, బహదూర్‌పురా, కోఠి, అబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టి, బషీర్‌బాగ్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌తో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. ఇక‌.. సాయంత్రం వరకు ఎండ దంచికొట్టగా.. కొద్దిసేపట్లోనే వాతావరణం మారిపోయింది. సిటీలోని ఇత‌ర ప్రాంతాల్లో గాలి దుమారం చెల‌రేగింది. దీంతో వాహ‌న‌దారులు దుమ్ము, ధూళికి ఇబ్బందిపడ్డారు.

సాయంత్రానికి నగరాన్ని మేఘాలు కమ్మేయడంతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వాన మొద‌ల‌య్యింది. వడగళ్ల వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎండ వేడితో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రం వేళ‌ ఈదురుగాలులతో వర్షం కురవడంతో వేడి నుంచి కాస్త రిలీఫ్ పొందార‌నే చెప్ప‌వ‌చ్చు. మరో వైపు రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అట్ల‌నే రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు మ‌రో రెండు డిగ్రీల దాకా పెరిగే చాన్స్ కూడా ఉందని అధికారులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement