ఉత్తరప్రదేశ్ లో నాలుగోసారి విజయం సాధించాలని అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు. 2014,2017,2019 తర్వాత రాష్ట్రంలో బిజెపికి వరుసగా నాలుగవ సారి విజయాన్ని అందించాలన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి మాత్రమే “సర్వ సమాజ్” లేదా మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలదని తెలిపారు. గత ఎస్పీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, గతంలో ప్రతి జిల్లాలో ఒక బాహుబలి (రాజకీయ బలవంతుడు), ఒక మినీ-సీఎం, స్కామ్ ఉండేవారని అమిత్ షా అన్నారు. దీనికి విరుద్ధంగా, బిజెపి ప్రభుత్వ హయాంలో, ప్రతి జిల్లాలో ఒక ఉత్పత్తి (ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం), ఒక పరిశ్రమ , ఒక వైద్య కళాశాల ఉన్నాయన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత ప్రస్తావనలో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని వదులుకోవడం ద్వారా అయోధ్యలో రామమందిరానికి “మార్గాన్ని సుగమం చేసినందుకు” ఈ సంవత్సరం ప్రారంభంలో మరణించిన మాజీ సిఎం , ఓబిసి నాయకుడు కళ్యాణ్ సింగ్ వారసత్వాన్ని కూడా అమిత్ షా ప్రశంసించారు. 1992లో సుపరిపాలన గురించి . వెనుకబడిన కులాల ప్రజలకు వారి హక్కులను అందించడం గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి శ్రీ సింగ్ అని కొనియాడారు. బాబూజీ (సింగ్) నాకు మార్గదర్శనం అందించకపోతే 2014, 2017, 2019లో విజయాలు సాధించి ఉండేది కాదని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..