వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఈ సెర్బియా యోధుడు 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ పై విజయం సాధించాడు. జకోవిచ్ తొలి సెట్ ఓడినప్పటికీ వరుసగా 3 సెట్లు చేజిక్కించుకుని చిరస్మరణీయ రీతిలో టైటిల్ సాధించాడు. వింబుల్డన్ లో జకోవిచ్ కు ఇది వరుసగా నాలుగో టైటిల్. ఓవరాల్ గా ఇది 7వ వింబుల్డన్ టైటిల్. ఈ విజయం అనంతరం, జకోవిచ్ కెరీర్ లో నెగ్గిన మొత్తం గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 21కి పెరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement